Wednesday, 28 June 2017

65. అందాల రేయి



చీకట్ల తెరలలో వెలుగులను దాచేసి
అస్తాద్రి ఒడిలోకి సూరీణ్ణి జార్చేసి
గగనాన నెలవంక వెన్నెల్లు పరిచేసి
వింతైన కాంతిలో కలిగించె హాయి..
          అపురూపమైనదీ అందాల రేయి..

సొగసైన తారకల దీపాలు పేర్చి
చిరుగాలి వీచికల అలసటల తీర్చి
కలలలో కలతలను మరిపింప చేసి
నిదర చిరుస్పర్శతో వాల్చె కనుదోయి..
          అపురూపమైనదీ అందాల రేయి

No comments:

Post a Comment

77. ప్రేమ

కాళిదాసు కావ్యాలైనా, త్యాగరాజు రాగాలైనా చెప్పాయి ఒకే మాట వినమా సృష్టి మనకిచ్చిన కానుక, అన్ని భావాలకు తలమానిక ఆత్మను పరమాత్మగ చేస...