చీకటిలో
చిగురాకుల కబురులాడు వేళలో
వాకిట్లో
నీకోసం వేచినాను రావా ॥
రేయి
చేడె మైకంలో ఒళ్ళు విరుచుకుంటోంది
ఆమె
కురులు కారు నలుపు ఇలన పరుచుకుంటోంది
కాటుక
వర్షించే ఆ నింగి వంక చూస్తూ ॥
వెండి
కురియు వెన్నెల తాపాన్ని రేపుతోంది
మల్లెల
సుమగంధంతో మేను రగులుతోంది
మబ్బుల
ఒడిలో ఒదిగిన చందురుణ్ణి చూస్తూ ॥
చెక్కిలి
చుంబించి నవ్వి వెక్కిరించే చిరుగాలి
నీ
అల్లరి జ్ఞాపకాలనెలా మనసు వేగాలి
కళ్ళలోని
దీపానికి ఆశ చమురు పోస్తూ ॥
No comments:
Post a Comment