గమ్యమెరుగని
ప్రయాణంలో నేను ఒంటరి బాటసారిని
సొమ్మసిల్లి
తపించి దారిని మరచిపోయాను
నేను
అలసిపోయాను
కొండవాగుల
ప్రవాహంలో కొట్టుకెళ్ళే గులకరాయిని
ఒడ్డుచేరక
మధ్యదారిన చిక్కిపోయాను
నేను
అలసిపోయాను
గుండె
గదిలో పరుగులెత్తి ఉరకలేసే రక్తకణమును
శిథిలమయ్యే
శ్వాసతోనే సమసిపోయాను
నేను
అలసిపోయాను
మబ్బుతునకల
చాటుమాటున దాగిపోయే నీటిబొట్టును
ఉరముమెరుపుల
ప్రహారంలో కాలిపోయాను
నేను
అలసిపోయాను
No comments:
Post a Comment