Wednesday, 28 June 2017

17. తీరలేదు నిరీక్షణ



తీయని నీ ఊసులతో రేయంతా గడిపాను
తీరలేదు నిరీక్షణ తీర్పు చెప్పవా ॥

పరుగాడుతు దరిచేరిన అలరాణిని
తీరం ముద్దాడెనెంతో పసగా
నును సిగ్గుల పల్లవించు చిగురాకును
చెక్కిలి చుంబించె గాలి కసిగా
వెచ్చని నీ ఊహలు నా ఊపిరిగా వేచాను తీరలేదు

నెలరాజు వెన్నెల కౌగిలివలలో
రేకన్నియ వన్నెలు కరిగించెనే
చల్లని పొగమంచు స్పర్శతో విరిసి
విరిచేడియ సొగసులు చిగురించెనే
చిన్ని చిన్ని అలికిడులకు ఉలికిపడుతు వేచాను తీరలేదు

No comments:

Post a Comment

77. ప్రేమ

కాళిదాసు కావ్యాలైనా, త్యాగరాజు రాగాలైనా చెప్పాయి ఒకే మాట వినమా సృష్టి మనకిచ్చిన కానుక, అన్ని భావాలకు తలమానిక ఆత్మను పరమాత్మగ చేస...