నా
కలల వీథిలో తిరగాడేనెవ్వరో
నా
మనసు తోటలో కదలాడేనెవ్వరో
అందజేయవా
ఆచూకీ ఓ చల్లగాలి
ఉంచుకోను
నీ బాకీ ఓ చల్లగాలి ॥
ఎప్పుడూ
లేదు గుండెల్లో ఈ రకం అలజడి
సన్నగా
నా ఊపిరిలో ఏదో వింత అలికిడి
ఆ చూపుల జ్ఞాపకాలకే తుళ్ళి పడతాను
చిరున్వవుల పరిహాసానికి సిగ్గుపడతాను
నా
మనసు తలుపు తాళం తెరిచేశారెవ్వరో
నా
లోని కన్నియ హృదయం గురి చూశారెవ్వరో
చెప్పవా తన చిరునామా ఓ వెండి జాబిల్లీ
నిలవలేదు ఇక ఈ భామా ఓ జాబిల్లీ ॥
కొత్తగా
అనిపిస్తోందే ఈ పులకరింత
అతని
తలపు కలిగించింది సన్నని గిలిగింత
నిదుర రాదు రేయంతా ఏదో కలవరంతో
మనసంతా నిండిపోతోంది కొత్త పరవశంతో
నానుంచి
నాకే దూరం పెంచేశారెవ్వరో
తలపుల్లో
తీయని మైకం నింపేశారెవ్వరో
ఎక్కడే అతని అతని విలాసం ఓ సిరిమల్లీ
చెప్పవే నీ చెలి కోసం ఓ సిరిమల్లీ ॥
No comments:
Post a Comment