Wednesday, 28 June 2017

5. నీకోసమే



హరివిల్లు విరిసింది నింగి నీకోసమే
చిరుజల్లు కురిసింది మబ్బు నీకోసమే
సూరీడు చీకట్లు కొండెనక దాచేసి
వెలుగులే తెచ్చాడు నీకోసమే

నెలరాజునర్థించి పున్నమి వెన్నెలలు
తెచ్చింది ఈ రేయి నీకోసమే
తుమ్మెదల వంచించి తేనియలు దాచుకుని
తెచ్చింది విరిచేడె నీకోసమే

మేఘాల పిలుపుకై వేచి ఉండక నెమలి
నాట్యాలు  చేసింది నీకోసమే
ఆమనికి సయితం గొంతు విప్పని గండు
కోయిలే పాడింది నీకోసమే

No comments:

Post a Comment

77. ప్రేమ

కాళిదాసు కావ్యాలైనా, త్యాగరాజు రాగాలైనా చెప్పాయి ఒకే మాట వినమా సృష్టి మనకిచ్చిన కానుక, అన్ని భావాలకు తలమానిక ఆత్మను పరమాత్మగ చేస...